దేశవ్యాప్తంగా కేంద్ర అధికార పార్టీ బిజెపిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తుందనే ఆరోపణలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈ సంచలన విషయాలను బయటపెడుతున్నారు.తెలంగాణ, ఆంధ్ర, రాజస్థాన్ ,ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు.
ఇటీవల టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి ప్రయత్నించిందని దానికి సంబంధించిన వీడియోలను కేసీఆర్ బయట పెట్టారు.ఆ వీడియోలో కూడా ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని కూల దోసెందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విషయాన్ని ఆ వీడియో సంభాషణలో ఉన్నట్లు కేసిఆర్ ప్రకటించారు.
అయితే 151 ఎమ్మెల్యేలతో తిరుగులేని ఆదిత్యాన్ని సాధించిన జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడం అంటే ఆశామాషి పని కాదు.ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది.
ఏపీలో బిజెపికి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి.ముందు ముందు ఇదే రకమైన పరిస్థితి ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
ఏపీలో బలపడేందుకు ఎంతగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా , బిజెపికి వర్కౌట్ కావడం లేదు.ఈ స్థితిలో వైసిపి ఎమ్మెల్యేలను బిజెపి తమ దారికి తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమయ్యే పని.ఇక మిగతా రాష్ట్రాలలోను దాదాపు ఇదే పరిస్థితి ఉంది .జగన్ తీరుపై కొంతమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్నా.ఇప్పటికిప్పుడు పార్టీ మారి వెళ్లేవారు ఎవరు కనిపించడం లేదు.అలా వెళ్లినా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత స్థాయిలో అయితే ఎమ్మెల్యేల వలసలు ఉండవు.

ఇక తెలంగాణలో బిజెపికి ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.ఏపీ, తెలంగాణలో రెండు ప్రభుత్వాలను కూలగొట్టాలి అంటే ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉండాలి.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సాహసం ఎవరు చేయలేరు.మునుగోడులో బిజెపి ఓటమి చెందింది .ఈ పరిస్థితుల్లో బిజెపిలోకి వెళ్లేందుకు ఎవరు సాహసం చేయలేరు.ఇక ఏపీలో క్షేత్రస్థాయిలో బిజెపి బలం నామ మాత్రమే.
ఈ స్థితిలో బిజెపి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను కూలగొట్టే అంత సాహసం చేయదు.అసలు ఆ పార్టీకి అంత సీన్ లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.







