మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు( Vasantha Nageswara Rao ) సంచలన వ్యాఖ్యలు చేశారు.నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ జనసేన నాయకురాలు తంబళ్లపల్లి రమాదేవికి( Tamballapally Ramadevi ) వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ రెండు సార్లు అవకాశం ఇచ్చిందన్నారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో నందిగామ టికెట్ ను( Nandigama Ticket ) కనుక రమాదేవికి ఇస్తే పూర్తి మద్ధతు ఇస్తామని వసంత నాగేశ్వర రావు పేర్కొన్నారని తెలుస్తోంది.కాగా ఐతవరం గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మను ఆ పార్టీ నాయకురాలు రమాదేవి ఆవిష్కరించారు.ఈ సందర్భంగానే ఆమె మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావును మర్యాదపూర్వకంగా కలిశారని సమాచారం.