మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి మద్దతు వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు.పాదయాత్రకు జనాలను తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తాము తరలిస్తే వంద, రెండు వందల మంది మాత్రమే వస్తారని… ఇంత మంది వస్తున్నారంటే పార్టీలకు అతీతంగా జనాలు వస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతుందని చెప్పారు.

 Sensational Comments Of Former Minister Konda Surekha-TeluguStop.com

రాహుల్ కావాలనుకుంటే ప్రధాని అయ్యుండేవారని, కేంద్ర మంత్రి అయ్యుండేవారని… అలాంటి వ్యక్తి ఏసీ గదులను వదిలిపెట్టి జనాల్లోకి వచ్చారని అన్నారు.అధికారం ఉందికదా అని మేము ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే పొరపాటేనని… రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని సురేఖ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పేదల పక్షమేనని అన్నారు.టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి ఫామ్ హౌస్ డ్రామా ఆడాయని… కాంగ్రెస్ ను ఓడించడమే ఈ పార్టీల లక్ష్యమని చెప్పారు.

మంత్రి కేటీఆర్ ఒక బచ్చా అని… కేసీఆర్ పెద్ద డ్రామా రాయుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube