తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హాస్య సినిమాలలో హీరోగా నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నరేష్ గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈయన వరుస సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నరేష్ ఎన్నో వివాదాలకు కూడా కారణం అవుతున్నారు.ఇకపోతే ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్న రిలేషన్ వల్ల ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
ఇక మా ఎన్నికల సమయంలో నరేష్ మెగా ఫ్యామిలీ పై పరోక్షంగా ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.తాజాగా మెగా బ్రదర్ నాగబాబు నటుడు నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నరేష్ అంత చేతకాని ప్రెసిడెంట్ ను తాను చూడలేదని ఈయన వెల్లడించారు.
నరేష్ ఏ విషయాన్ని అయినా తన కెపాసిటీ మించి ఆలోచిస్తూ ఉంటారు.ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి జనాలు ముందుకు తీసుకువస్తారు.
అన్ని విషయాలు జనాలకు తెలియాల్సిన అవసరం లేదంటూ నాగబాబు పేర్కొన్నారు.
నరేష్ తనని తప్ప ఇంకొకరిని ఇష్టపడరు ఈయనకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక రకమైన గొడవలు ఉంటాయి.నరేష్ అదోరకమైన మానసిక జబ్బుతో బాధపడుతున్నారంటూ ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నరేష్ మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోను ప్రస్తుతం కూడా అతని సలహాలు వ్యాఖ్యలు మా అసోసియేషన్ కు ప్లస్ కాకపోయినా పర్వాలేదు కానీ ఈయన వల్ల ఇబ్బందులు ఎదురవకూడదంటూ నరేష్ గురించి నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే నాగబాబు ఉన్నఫలంగా నరేశ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలపై నరేష్ ఎలా స్పందిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.