మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇరు పార్టీల నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు.
ఓ వైపు కేంద్రం టార్గెట్ గా మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శలకు బీజేపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ పార్టీ నేతలు పిచ్చి వేషాలు వెయ్యొద్దని, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు.
ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.అనంతరం తన భార్య జమునపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆయన.అనవసర మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు.తమ జోలికి వస్తే మాడి మసి అవుతారని హెచ్చరించారు.