కెసిఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించారు.బీఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ, వారి మద్దతు తనకు ఉండేలా చేసుకుంటున్నారు.ఢిల్లీ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేసిన కేసిఆర్, అక్కడ పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలని విషయం పైనే పూర్తిగా దృష్టి సారించారు.టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ పరిశీలించారు.
ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం టిఆర్ఎస్ చేసిన తీర్మానం, దానికి అవసరమైన అన్ని దస్త్రాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.ఇప్పుడు పూర్తిగా పార్టీ ని బలోపేతం చేసే విషయంపైనే దృష్టి సారించారు.
ఇది ఎలా ఉంటే బిఆర్ఎస్ పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీలో పదవుల కేటాయింపుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా తన కుమార్తె ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిని అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారట.
పార్టీ ప్రకటన సమయంలో కవిత ఆ సమావేశానికి హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు కలిగిన నేపథ్యంలో తండ్రి వెంట కవిత పర్యటనలు చేస్తున్నారు.సమాజ్ వాదీ పార్టీ అధినేత మలయం కు నివాళులర్పించేందుకు కేసిఆర్ తో పాటు కవిత కూడా వెళ్లారు.

అలాగే వివిధ రాష్ట్రాల లో అక్కడ ప్రాంతీయ పార్టీలు అధినేతలతో జరిగిన సమావేశాల్లోనూ కవిత పాల్గొన్నారు.ప్రస్తుతం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు టిఆర్ఎస్ బీఆర్ ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ శాఖకు కేటీఆర్ అధ్యక్షుడు అవుతారు. అలాగే రానున్న రోజుల్లో తెలంగాణలో కేటీఆర్ కే పూర్తిగా బాధ్యతలు అప్పగించబోతున్నారు.దీంతో కవితకు ఏ విధంగా న్యాయం చేస్తారనే ప్రశ్న పార్టీలోని చాలామంది నాయకుల్లో ఉండడం, కవితను కేసీఆర్ పక్కన పెడుతున్నారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కన్వీనర్ గా కవితకు అవకాశం ఇవ్వాలని, త్వరలోనే దీనిపై ప్రకటన చేయాలని ఆలోచనలు కేసీఆర్ ఉన్నారట.







