దేశంలో నెలకొన్న అనుకూల, ప్రతికూల పరిస్దితుల మధ్య బీజేపీ తన పార్టీకి ప్రజల్లో ఉన్న ఆధరాభిమానాలను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుందట.ఎందుకంటే కరోనా వచ్చాక కేంద్రం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కొన్ని కొన్ని సంఘటనలు ఇప్పటికే నిరూపించాయి.

ఈ నేపధ్యంలో ఎక్కడా పార్టీ ప్రతిష్ట దిగజారకుండా, అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తుందట.ఈ క్రమంలో వలసలను కూడా భారీగానే ప్రోత్సహిస్తుంది.ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చారు.కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద హస్తానికి గుడ్‌బై చెప్పి కమళం కండువా కప్పుకున్నాడట.కాగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నటుగా సమాచారం.ఇక జ్యోతిరాధిత్య సింధియా కూడా గతంలో బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఇలా కోలుకోకుండా చేస్తున్నారన్నమాట కేంద్ర పెద్దలు అని అనుకుంటున్నారట కొందరు నేతలు.