మెగాస్టార్ రాజశేఖర్ మధ్య గొడవలకు అసలు కారణమిదే.. అలా చేశారంటూ?

గత కొన్నేళ్లుగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలకు సంబంధించి వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజశేఖర్ చిరంజీవితోనే కలిసి తెలుగులో తొలి సినిమా చేశారని రాజశేఖర్ తొలి సినిమా ఆరాధన అని అన్నారు.

 Senior Journalist Bharadwaj Comments About Differences Betweeen Chiranjeevi And-TeluguStop.com

చిరంజీవి తోడల్లుడు న్యాయం కోసం అనే సినిమాను చిరంజీవితో నిర్మించాలని అనుకున్నారని అయితే చిరంజీవి సూచనల మేరకు రాజశేఖర్ తో చేశారని ఆయన చెప్పారు.

ఆ సినిమా మలయాళ సినిమా రీమేక్ అని భరద్వాజ్ అన్నారు.

చిరంజీవి, రాజశేఖర్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేదని ఆయన తెలిపారు.చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో భీమవరం ప్రాంతంలో రాజశేఖర్ కు సన్మానం జరగగా రాజశేఖర్ చిరంజీవి గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు.

ఆ కామెంట్లతో హర్ట్ అయిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ పై దాడులు చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత చిరంజీవి రాజశేఖర్ ఇంటికి వెళ్లి అభిమానులు చేసిన పనికి సారీ చెప్పి వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత రాజశేఖర్, కుటుంబ సభ్యులు ప్రజారాజ్యంపై, చిరంజీవిపై నెగిటివ్ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ రిలీజ్ సమయంలో రాజశేఖర్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత జీవిత సారీ చెప్పిందని ఆయన అన్నారు.

Telugu Chiranjeevi, Rajasekhar-Movie

ఆ సమయంలో చిరంజీవి చెడు చెవిలో చెప్పాలని మంచి మైక్ లో చెప్పాలని అన్నారని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి రాజశేఖర్ కలిసి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని అంతకు మించి వాళ్లిద్దరి మధ్య పెద్ద సమస్య ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube