తగ్గేదేలే.. యూఎస్ లో ఇంకా ఊపేస్తున్న 'ఊ అంటావా మావా'..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప.ఈ సినిమాలో ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది.

 Usa Girl Shakes A Leg In Oo Antava Song Details, Samantha, Oo Antava Song, Pushp-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఎక్కడ విన్న పుష్ప సాంగ్స్ నే వినిపిస్తున్నాయి.ఏ ఇండస్ట్రీ చూసిన పుష్ప మ్యానియానే నడుస్తుంది.

ఇక ”ఊ అంటావా.ఊఊ అంటావా మామ” సాంగ్ ఈ సినిమాకే హైలెట్.

పుష్ప సినిమాలో ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంత ఆడిపాడిన విషయం తెలిసిందే.ఈమె ఈ పాటతో సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియాను కూడా ఊపేసింది.

ఈ పాటకు సోషల్ మీడియాలో కొన్ని వందల మంది డ్యాన్స్ స్టెప్పులు వేసి వీడియోలు పోస్ట్ చేసారు.ఈ వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజెన్స్ ను అలరించాయి.

ఈ పాట వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా ఊపు తగ్గలేదు.ఈ పాటకు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అందరు స్టెప్పులు వేసి అదరగొట్టారు.

దీనికి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసాయి.ఇక తాజాగా యుఎస్ఏ లో ఒక 13 ఏళ్ల చిన్నారి ఈ పాటకు వయోలిన్ వాయిస్తూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి వాతావరణం తీసుకు వచ్చింది.

కరోలినా అనే అమ్మాయి ఈ సాంగ్ కు అద్బుతమైన వయోలిన్ కవర్ సాంగ్ చేసి అందరిని ఆకర్షించింది.దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఇలా పుష్ప పాటలు ఇప్పటికి వరల్డ్ వైడ్ గా అలరిస్తూనే ఉన్నాయి.ఎవరో ఒకరు ఇలాంటి ఆసక్తికర వీడియోలను చేస్తూ అలరిస్తూనే ఉన్నారు.యుఎస్ లో ఉన్న అమ్మాయి సైతం ఇలా ప్లే చేస్తుంది అంటే మన పుష్ప క్రేజ్ ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube