కెనడా: భారత సంతతి బ్యూరోక్రాట్‌కి కీలక పదవి.. ఎవరీ హర్‌ప్రీత్ కొచ్చార్..?

భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.

సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.

కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.

ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాలు, వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్నారు.చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ భారతీయులు రాణిస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన బ్యూరోక్రాట్ హర్‌ప్రీత్ కొచ్చార్ కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ చీఫ్‌గా నియమితులయ్యారు.డాక్టర్ హర్‌ప్రీత్ కెనడాలోని సీనియర్ బ్యూరోక్రాట్.

Advertisement

అసోసియేట్ డిప్యూటీ మినిస్టర్ హోదాలో ఇయాన్ స్టీవర్ట్ స్థానంలో ఈ నెలాఖరులో బాధ్యతలు స్వీకరించనున్నారు.గతేడాది జనవరిలో విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ లాబొరేటరీ నుంచి ఇద్దరు చైనా సంతతి శాస్త్రవేత్తలను తొలగించడంపై సరైన వివరణ ఇచ్చేందుకు నిరాకరించడంతో స్టీవర్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

దీనికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా .ఆయనను మందలించారు.హర్‌ప్రీత్ నియామకానికి సంబంధించి కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటన చేశారు.

ఇదే సమయంలో ఇన్ని రోజులూ బాధ్యతలు నిర్వర్తించిన స్టీవర్ట్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా అమలు చేయడంలో స్టీవర్ట్ కీలకపాత్ర పోషించారని ట్రూడో ప్రశంసించారు.

ప్రస్తుతం కెనడాలో కోవిడ్ నాలుగవ దశలో వుంది.ఈ క్రమంలో కొచ్చార్ కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటిలో వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొచ్చార్.అనంతరం కెనడాకు వలసవెళ్లారు.అనంతరం ఒంటారియో ప్రావిన్స్‌లోని గ్వెల్ఫ్ యూనివర్సిటీలో యానిమల్ బయోటెక్నాలజీలో డాక్టరేట్ పూర్తి చేశారు.ఏప్రిల్‌ 2020లో హెల్త్ కెనడాలో చేరడానికి ముందు .2017లో ఇమ్మిగ్రేషన్, శరణార్ధులు, పౌరసత్వ విభాగంలో కొచ్చార్ పనిచేశారు.కెనడియన్ ఫుడ్ ఇన్స్‌పెక్షన్ ఏజెన్సీకి చీఫ్‌గా కూడా ఆయన విధులు నిర్వర్తించారు.

Advertisement

తాజా వార్తలు