సీనియర్ నటి రాధా ( Actress Radha ) ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ 80 s లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.మరీ ముఖ్యంగా రాధా ,చిరంజీవి ( Radha,Chiranjeevi ) కాంబినేషన్లో పదుల కొద్ది సినిమాలు వచ్చాయి.
వీరిద్దరి జోడి కి అప్పట్లో హిట్ పెయిర్ అనే గుర్తింపు కూడా ఉంది.అయితే అలాంటి రాధా సినీ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే బిజినెస్ మాన్ అలాగే తమ బంధువైన రాజశేఖరన్ నాయర్ ని పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటూ బిజినెస్ లను చూసుకుంటుంది.ఇక రాధా భర్తకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.
అలా రెస్టారెంట్ పనులు రాధా చూసుకుంటుంది.ఇక ఈ మధ్యకాలంలో మాటీవీలో ప్రసారమయ్యే ఒక డాన్స్ షోకి జడ్జిగా కూడా చేసింది.

అయితే తాజాగా రాధా తన కూతురు హీరోయిన్ అయినటువంటి కార్తిక నాయర్( Karthika nair ) కి పెళ్లి చేసింది.ఇక ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా కార్తిక నాయర్ వేసుకున్న బంగారం కనిపించింది.కార్తిక నాయర్ కంటే ఎక్కువగా ఆమె బంగారం పైనే అందరి దృష్టి పడింది.ఇక ఒకేసారి అన్ని నగలు వేసుకోవడంతో రాధా ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో కూతురికి అన్ని నగలు పెట్టింది అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
మరి ఇంతకీ రాధా ఆస్తులు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందామా.

రాధా కూతురు హీరోయిన్ కార్తిక రోహిత్ ( Rohith ) అనే బిజినెస్ మాన్ ని ప్రేమించి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంది.ఇక వీరి పెళ్లి కేరళలోని ఓ రీసార్ట్ జరిగింది.అలాగే వీరి పెళ్లి కేరళ సాంప్రదాయంలోనే జరిగింది.
ఇక కార్తీక పెళ్లికి చిరంజీవి రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.ఇక వీరికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే కార్తీక ఒంటి నిండా నగలతో దేవతలా కనిపించింది.దాంతో రాధా ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉంటాయో అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
ఇక రాధా రాజశేఖరన్ ( Radha,Rajasekhar Nair ) ఆస్తులు మొత్తం కలిపి దాదాపు 300 కోట్ల వరకు ఉంటాయట.రాధ సినిమాల్లో సంపాదించిన డబ్బులు అలాగే రాధ భర్త బిజినెస్ లో సంపాదించిన డబ్బులు మొత్తం కలిపి అన్ని వందల కోట్లు ఉంటాయని సమాచారం.







