టీడీపీకి షాక్ ఇచ్చిన నటి జయసుధ! వైసీపీలో చేరిక!

సినీ నటి జయసుధని వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలలోకి తీసుకొచ్చి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆమెని బరిలో నిలిపారు.

ఇక అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్తానం కాంగ్రెస్ పార్టీతో మొదలెట్టిన జయసుధ, గత ఎన్నికల వరకు ఆ పార్టీలోనే వున్నారు.

అయితే రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరిన ఆమె క్రియాశీలక రాజకీయాలకి దూరంగా వున్నారు.ఇదిలా వుంటే తాజాగా జయసుధ చంద్రబాబుకి షాక్ ఇస్తూ టీడీపీ పార్టీకి రాజీనామా చేసారు.

ఇక ఈ రోజు సాయంత్రం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు.రానున్న ఎన్నికలలో క్రియాశీలకంగా ఏపీ రాజకీయాలలో భాగం కావాలని భావించి ఆమె వైసీపీ పార్టీని వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

వైఎస్ కుటుంబంతో వున్నా అనుబంధం కొద్ది ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement
గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!

తాజా వార్తలు