సెల్ఫీలతో శరీరానికి కొత్తరకమైన సమస్య

"టెన్నిస్ ఎల్బో" .ఈ పదం ఎప్పుడైనా విన్నారా? దీని గురించి మీకు తెలియాలంటే మీరేమి టెన్నిస్ చూడనక్కరలేదు.

మీరే గనుక క్రికేట్ అభిమానై, సచిన్ టెండుల్కర్ గురించి బాగా తెలిసుంటే ఈ "టెన్నిస్ ఎల్బో" గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ఎందుకంటే ఈ గాయం వలన సచిన్ కొన్ని నెలలపాటు ఆటకు దూరం కావాల్సివచ్చింది.ఈ రకమైన గాయం మోచేతికి అవుతుంది.టెన్నిస్ ఆడేవారు ఎక్కువగా దీని వలన బాధపడతారు కాబట్టి ఆ పేరు వచ్చింది.

గోల్ఫ్ ఆడేవారికి కూడా తరచుగా మోచేతిలో ఒక గాయం అవుతుంది.దీన్ని గోల్ఫర్ ఎల్బో అని అంటారు.

ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు.ఎందుకంటే కొత్తగా "సెల్ఫీ ఎల్బో" అనే గాయం యువతీయువకులలో త్వరలోనే కనిపించవచ్చు అంట.ఇది సెల్ఫీలు ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్నవారిని ఇబ్బందిపెట్టే గాయం.అందుకే దీనికి సెల్ఫీ ఎల్బో అనే పేరు పెట్టారు.

Advertisement

మొబైల్ చాటింగ్ లో కొత్త ఒరవడి తీసుకొచ్చింది బ్లాక్ బెర్రి.ఈ వాట్సాప్, హైక్ లాంటివి లేకముందు యువతలో బ్లాక్ బెర్రి ఫొన్లంటే తెగ క్రేజు.

కేవలం చాటింగ్ కోసం ఆ ఫోన్లు కొనేవారు.రోజంతా చాట్ చేయడం వలన చాలామందికి చేతుల్లో స్పర్శ తగ్గిందట.

ఇప్పుడు ఇలాంటి ప్రమాదంలోనే సెల్ఫీ అడిక్స్ట్ ఉన్నారని, రోజంతా సెల్ఫీలు దిగుతూ చేతుల మీద, ముఖ్యంగా మోచేతి మీద ఒత్తిడి పెంచుతున్నారని, ఇదే పద్ధతి కొనసాగిస్తే "సెల్ఫీ ఎల్బో" సమస్య యువతని ఇబ్బందిపెడుతుందని హెచ్చరించారు అమెరికా డాక్టర్లు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు