తిండిలేక అక్కడ తినేవాళ్లం.. శేఖర్ మాస్టర్ కన్నీటి కష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.శేఖర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో రాకేష్ మాస్టర్ బాగా డ్యాన్స్ చేసేవారని రాకేష్ మాస్టర్ లో కొత్త స్టైల్ ఉండేదని తెలిపారు.

 Sekhar Master Career Shocking Troubles Details Here Goes Viral , Shekar Master,-TeluguStop.com

నా డ్యాన్స్ స్టైల్ ను లారెన్స్ మాస్టర్ ప్రశంసించారని శేఖర్ మాస్టర్ తెలిపారు.రాకేష్ మాస్టర్ దగ్గర నేను తక్కువ సమయమే ఉన్నానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

నా ఫస్ట్ సినిమా పోస్ట్ బాక్స్ అని ఆ సినిమా రిలీజ్ కాలేదని శేఖర్ మాస్టర్ అన్నారు.కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న సాంగ్స్ ఎక్కువగా చేశానని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.

నేను చాలా కష్టాలు పడ్డానని ఆయన తెలిపారు.సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనుక ఒక కథ ఉంటుందని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

ఇంటికి వెళ్తే డబ్బులు ఇస్తారని కానీ ఎంతకాలం అని తెచ్చుకుంటామని శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు.

దొంగచాటుగా ఫంక్ష హాల్స్ కు వెళ్లేవాళ్లమని గుర్తు పట్టకుండా ఉండటానికి సత్య మాట్లాడేవాడని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

అప్పుడప్పుడూ ఫంక్షన్ హాల్స్ లో తినేవాళ్లమని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.రెండు మూడు సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్లానని శేఖర్ మాస్టర్ తెలిపారు.ఆ సమయంలో 75 రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.రోజుకు ఒకపూట తిండి దొరికినా తింటే హ్యాపీగా ఉంటుందని అనుకునే సమయంలో 75 రూపాయలు కూడా ఎక్కువేనని ఆయన తెలిపారు.

Telugu Career Troubles, Fruit, Nurse, Sekhar Master-Movie

డ్యాన్సర్ గా సెటిల్ కాకుండా వేరే జాబ్ చేస్తే శ్రద్ధ తగ్గుతుందని నేను భావించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.నాకు డ్యాన్స్ అంటే ప్రాణమని ఆయన తెలిపారు.చిన్నప్పుడే నాన్న చనిపోయారని శేఖర్ మాస్టర్ తెలిపారు.అమ్మ నర్స్ అని నాన్న ఫ్రూట్ బిజినెస్ చేసేవారని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube