సెంటిమెంట్‌నే నమ్ముకున్న శేఖర్ కమ్ముల.. వర్కవుట్ అవుతుందా?

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం లవ్ స్టోరి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తు్న్నాడు ఈ డైరెక్టర్.

 Sekhar Kammula On Nagachaitanya And Sai Pallavi-TeluguStop.com

ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో లవ్‌స్టోరి పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా విషయంలో శేఖర్ కమ్ముల ఒకటి కాదు రెండు సెంటిమెంట్‌లను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఆనంద్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టిన శేఖర్ కమ్ముల, ఆ తరువాత కమిలినీ ముఖర్జీని వరుసగా తన సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టి సక్సె్స్ అందుకున్నాడు.ఇప్పుడు ఫిదా చిత్రంతో తనకు అదిరిపోయే హిట్ అందించిన సాయి పల్లవిని మరోసారి లవ్‌స్టోరి చిత్రంలో పెట్టుకున్నాడు.

ఇక ఫిదా సినిమా మెజారిటీ షూటింగ్ బాన్సువాడలో తీసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లవ్‌స్టోరి చిత్ర షూటింగ్‌ను కూడా బాన్సువాడలోనే తెరకెక్కిస్తుండటంత విశేషం.

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.మరి ఈ సెంటిమెంట్ శేఖర్ కమ్ములకు ఎలాంటి వజయాన్ని అందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube