ప్రపంచంలో ఎన్నో ప్రమాదకరమైన వంతెనలు ఉన్నాయి.వాటన్నిటిలో అత్యంత ప్రమాదకరమైన వంతెన మన దాయాది దేశం పాకిస్థాన్‌లో ఉంది.
పాసు ( Passu ) లేదా హుస్సేనీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ( Hussaini Hanging Bridge ) అని పిలిచే ఈ వంతెన చాలా పొడుగ్గా ఉంటుంది.ఐదారు అంతస్తుల ఎత్తులో ఉంటుంది.
పాత చెక్కలతో తయారు చేసిన ఈ బ్రిడ్జి హుంజా నదిపై వేలాడుతూ ఉంటుంది.ఈ వంతెన వెడల్పు చాలా చిన్నగా ఉంటుంది.
వీచే గాలులకు అది ఊగుతూ ఉంటుంది.అంత పెద్ద ఎత్తులో ఇంత చిన్న వంతెన, అది కూడా దృఢంగా లేని వంతెనపై ఒక్కో అడుగు వేస్తుంటే గుండె అదురుతుంటుంది.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దీనిపై వెళ్లాల్సి ఉంటుంది.
ఈ వంతెనను స్థానికులు తమ వ్యవసాయ పొలాలకు చేరుకునేందుకు వాడుతుంటారు.థ్రిల్‌ను అనుభవించాలనుకునే పర్యాటకులు కూడా దీనిని ఉపయోగిస్తారు.తాజాగా అలాంటి వ్యక్తుల్లో ట్రావెల్ బ్లాగర్ జీ( Travel blogger Zee ) కూడా చేరిపోయాడు.
ఈ బ్లాగర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ వంతెనను ధైర్యంగా దాటి అందరి చేత పొగిడించుకుంటున్నాడు.ఈ బ్రిడ్జిని దాడేటప్పుడు అతడు వీడియో కూడా రికార్డ్ చేశాడు.
దానిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ కూడా చేశాడు అది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో బ్లాగర్ జీ వంతెనపై ధైర్యంగా నడవటం చూడవచ్చు.పాత చెక్క పలకలు, పగుళ్లతో ఉన్న ఈ వంతెన భయానకంగా కనిపించినప్పటికీ, జీ రిస్క్ తీసుకొని దానిని దాటాడు.ఆయన ధైర్యానికి ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
దానిని సందర్శించాలని ఉన్నట్లు కొందరు కోరుకున్నారు, అయితే మరికొందరు ఇది చాలా ప్రమాదకరమైనదని, వినోదం కోసం ఉపయోగించకూడదని అన్నారు.ప్రజలు దానిని దాటడం సురక్షితం కాదని వారు ఆందోళన చెందారు.