మాటీవీలో ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం తో తెలుగు చిత్ర సీమ రంగంలోకి యాంకర్ గా అడుగు పెట్టింది స్వాతి రెడ్డి( Swathi Reddy ).ఇక ఈ ప్రోగ్రాం కి మొదట్లో అంతగా ఆదరణ ఉండకపోయేది.
కానీ ఎప్పుడైతే స్టార్ హీరోలు ఈ ప్రోగ్రాం కి గెస్టులుగా వచ్చారో అప్పటినుండి కలర్స్ ప్రోగ్రాం బుల్లితెరపై మంచి రేటింగ్స్ తో దూసుకుపోయేది.దాంతో స్వాతి రెడ్డి కాస్త కలర్స్ స్వాతి ( Colours Swathi ) గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత యాంకరింగ్ కి గుడ్ బై చెప్పి డేంజర్ ( Danger ) సినిమాతో సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ ఈమె హీరోయిన్ గా చేసింది తమిళ్ మూవీ సుబ్రహ్మణ్యం పురం( Subramanya puram ).ఈ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది స్వాతి.ఈ సినిమా తర్వాత తెలుగులో అష్టా చమ్మా ( Asta Chamma ) తో నాని ( Nani ) సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి కూడా పరిచయమైంది.ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి స్టేటస్ సంపాదించింది.

కానీ కొన్ని సంవత్సరాలకి అవకాశాలు తగ్గడంతో వికాస్ వాసు( Vikas vasu ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా థాయిలాండ్ కి వెళ్లి భర్తతోపాటు కలిసి ఉండేది.పెళ్లైన రెండు మూడు సంవత్సరాలకి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పంచతంత్రం, ఇడియట్స్, మంత్ ఆఫ్ మధు (Month of madhu) వంటి సినిమాలతో అలరించింది.

అయితే ఈ మధ్య కాలంలో కలర్స్ స్వాతి తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ రూమర్ పై తాజాగా ఒక మీడియా హౌస్ వాళ్ళు ఏకంగా కలర్స్ స్వాతి దగ్గరికి వెళ్లి మీరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి దానిపై క్లారిటీ ఇవ్వడం లేదని ప్రశ్న అడిగితే.అసలు విడాకులపై ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు.ఒకవేళ అలాంటి విడాకులు( Divorce ) తీసుకునే ఉద్దేశం ఉంటే నేనే మీకు ముందుగా చెబుతాను అని చెప్పిందట.కానీ మీ భర్త తో దిగిన ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు అంటే ఆ ఫోటోలు అన్నీ నేను ఆర్కైవా లో పెట్టాను అని ఆన్సర్ ఇచ్చిందట.
కానీ ఈమె ఇచ్చిన ఆన్సర్ కి ఏకీభవించని చాలామంది నెటిజన్స్ నిజంగానే కలర్స్ స్వాతి ( Colours Swathi ) విడాకులు తీసుకుంటుందని, ఆల్రెడీ విడాకులకు అప్లై చేసినప్పటికీ ఈ విషయాన్ని బయట పెట్టడం లేదని, విడాకులు మంజూరయ్యాక ఆ విషయాన్ని అందరికీ చెబుతుంది కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.








