మొత్తం ఉన్న 64 కళల్లో చోర కళ కూడా ఒకటని పెద్దలు చెబుతారు.కేవలం డబ్బులు సంపాధించడమే కాదు వాటిని తస్కరించడం కూడా కష్టంతో కూడుకున్న పని.
కానీ కొంత మంది ఇలా చోర కళలో ఆరి తేరినవారు డబ్బులు కొట్టేయడం ఇంత ఈజీయా అనే రీతిలో పర్సులు తస్కరిస్తారు.అసలు సమయం సందర్భం లాంటివి ఏవీ చూసుకోకుండా అవతలి వ్యక్తి ఎంత బాధలో ఉన్న కొంతమంది పిక్ పాకెటర్స్ ప్రవర్తిస్తుంటారు.
తాజాగా హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లో అంత్యక్రియల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద ఓ వ్యక్తి తన హస్తవాసిని ప్రయోగించాడు.తనను ఏమార్చి ఎలాంటి అనుమానం రాకుండా పర్స్ కొట్టేశాడు.
కానీ ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ దొంగ చేసినదంతా బయట పడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చనిపోయిన వ్యక్తిని వ్యాన్‌లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అక్కడకు వచ్చిన ఓ దొంగ ఇదే అదనుగా అక్కడ ఉన్న ఓ వ్యక్తి వద్ద నుంచి పర్స్ కొట్టేస్తాడు.అలా పర్స్ కొట్టేస్తున్న అతడిని మరో వ్యక్తి ఎవరూ చూడకుండా కవర్ చేస్తాడు.

పని మొత్తం అయిపోయి పర్స్ కొట్టేశాక… మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు.ఇలా వీళ్లు చేసేదంత అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీరి బండారం బయటపడింది.ఈ ఘటన జరిగిన అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇలాగే అనేక మంది మహానగరంలో పిలవని పేరంటాలకు హాజరవుతూ… తమ చోర కళను ప్రదర్శిస్తూ… అమాయకుల జేబులను టూటీ చేస్తున్నారు.ఇలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.