జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీ హతమార్చడానికి కొంతమంది రెక్కీ నిర్వహించినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయంపై జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్.
కూడా ఇటీవల పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.విశాఖ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇల్లు మరియు పార్టీ కార్యాలయం దగ్గర అనుమానస్పదంగా కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారని పేర్కొన్నారు.
అంతేకాదు పవన్ ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు.
ఇక ఇదే విషయంపై తాజాగా బీజేపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్పందించారు.
పవన్ కళ్యాణ్ కి తగినంత భద్రతను కల్పించాలని కోరారు.ఆయన ఇంటి వద్ద అనుమానస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే వార్తలు వస్తున్నాయి.
అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన భద్రతను పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్రంలో ఉన్న పోలీసులు వైసీపీ పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు.