మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్.మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో ఆచార్య లోటును కూడా గాడ్ ఫాదర్ సినిమా తీర్చిందని చెప్పాలి.
ఇకపోతే ఈ సినిమా చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.
అయితే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని చాలా బోరింగ్ అంటూ చేసినటువంటి కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
అనుదీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రశ్న ఎదురయింది.చాలామంది తనని గాడ్ ఫాదర్ సినిమా చూశారా అంటూ ప్రశ్నిస్తున్నారని ఈయన తెలిపారు.ఈ విధంగా అందరూ అడగడంతో తాను గాడ్ ఫాదర్ సినిమా చూశానని అయితే తనకు సినిమా ఏ మాత్రం నచ్చలేదు, చాలా బోరింగ్ గా ఉందంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా అనుదీప్ చెప్పిన సమాధానం విన్న యాంకర్ ఒక్కసారి షాక్ అవుతూ మీరు ఏ గాడ్ ఫాదర్ గురించి చెబుతున్నారు అంటూ క్లారిటీగా అడిగారు.ఈ ప్రశ్నకు అనుదీప్ సమాధానం చెబుతూ తాను హిందీ మూవీ గాడ్ ఫాదర్ సినిమా గురించి చెబుతున్నానని ఆ సినిమా నాకు ఏమాత్రం నచ్చలేదంటూ ఈయన చివరిలో ట్విస్ట్ ఇచ్చారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవడంతో కొందరు చిరంజీవి గాడ్ ఫాదర్ గురించి మాట్లాడి ఉంటారని చివరిలో ఇలా మాట మార్చారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.మొత్తానికి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







