Balakrishna Sharvanand : ఆ పేరు చెప్పొద్దంటూ శర్వానంద్ ని రిక్వెస్ట్ చేసిన బాలయ్య.. కారణం?

నందమూరి హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.ఈ షో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.ఈ షోకి భారీగా ప్రేక్షకదారణ లబ్ధిస్తోంది.ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి గల కారణం బాలకృష్ణ.ఈ షో ద్వారా బాలకృష్ణ తనలో ఉన్న మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీటిక్ గా డ్యాన్సులు చేస్తూ మాట్లాడుతూ షోకి వచ్చే సెలబ్రిటీలతో కూడా అదే విధంగా చూస్తూ మాట్లాడిస్తూ అల్లరి అల్లరి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు.

 Unstoppable 2 Episode 3 New Promo Sharwanand Reveals Balakrishna Dance With Youn-TeluguStop.com

కాగా అన్ స్టాపబుల్ సీజన్ వన్ భారీ విజయం సాధించడంతో ఇటీవలే అనుస్థాపకులు సీజన్ 2 ని గ్రాండ్ గా ప్రారంభించిన విషయం మనం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ సీజన్ కు సంబంధించిన మూడవ ఎపిసోడ్ నవంబర్ 4 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

మూడవ ఎపిసోడ్ కి యంగ్ హీరోలు అయిన అడవి శేష్,శర్వానంద్ లు గెస్ట్ లుగా వచ్చారు.తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.కాగా ఆ వీడియోలో హీరో శర్వానంద్ బాలయ్య బాబు గురించి చెబుతూ ఒక పార్టీలో జరిగిన విషయం గురించి తెలిపాడు.

ఒక పార్టీలో భాగంగా బాలకృష్ణ మరొక అమ్మాయి డాన్స్ వేయడానికి రెడీ అయ్యారట.5:30 నిమిషాల నిడివి ఉన్న ఒక పాటకు బాలకృష్ణ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి డాన్స్ చేయడం ప్రారంభించగా ఆ అమ్మాయి మూడున్నర నిమిషాలు అవ్వగానే ఆగిపోయిందట.కానీ బాలకృష్ణ మాత్రం ఆ పాట పూర్తవుగానే కమాన్ నెక్స్ట్ సాంగ్ ప్లే చేద్దాం అంటూ ఇంకొక పాట వేయమన్నారని బాలయ్య బాబు ఎనర్జీ అంటే అది అని చెప్పుకొచ్చారు శర్వానంద్.

ఆ స్టోరీ అయిపోయే వరకు నవ్వుతూ సైలెంట్ గా ఉన్న బాలకృష్ణ.ఆ విషయం చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అంటూ శర్వానంద్ ని కామెడీగా రిక్వెస్ట్ చేశారు.

కాగా ఇం దుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube