ఆహారం లేకుండా, రెస్ట్ తీసుకోకుండా ఎలాంటి వాహనాల సహాయం లేకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఒక్క పక్షులకే సాధ్యమని చెప్పొచ్చు.అయితే తాజాగా ఒక పక్షి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నాన్-స్టాప్‌గా ఏకంగా 13,560 కిలోమీటర్లు ప్రయాణించింది.
నీళ్లు, ఆహారం, నిద్ర ఇవేమీ లేకుండా అది ఉత్తర అమెరికాలోని అలస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు ఏకబిగిన ఎగురుకుంటూ వచ్చింది.పసిఫిక్ మహాసముద్రం మీదగా ప్రయాణించిన ఈ పక్షి పైన చెప్పిన దూరాన్ని కవర్ చేసేందుకు ఏకంగా 11 రోజుల సమయం పట్టింది.
అయితే ఈ పక్షి పెద్దది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.ఎందుకంటే ఇది చాలా చిన్న పక్షి.
దీని వయసు కేవలం 5 నెలలే! ఇంతకుముందు నాన్-స్టాప్ పక్షి ప్రయాణాల రికార్డులన్నింటినీ ఈ చిరుపక్షి తాజా ప్రయాణంతో బద్దలు చేసింది.
ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ.దీని పేరు బార్-టెయిల్డ్ గాడ్‌విట్.నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కనిపించే ఈ వలస పక్షి ఇటీవలే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణించి రికార్డు సృష్టించింది.
అక్టోబర్ 13న అలస్కా నుంచి దీని ప్రయాణం ప్రారంభమైంది.అక్టోబర్ 24న ఇది టాస్మానియాకి చేరుకుంది. శాటిలైట్ ట్యాగింగ్ నంబర్ 234684 ద్వారా దీని ప్రయాణాన్ని జర్మనీకి చెందిన పక్షి శాస్త్ర నిపుణులు ట్రాక్ చేశారు.ఉపగ్రహ జాడల ద్వారా ఈ పక్షి ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోలేదని వారు కనుగొన్నారు.

ఇప్పటివరకు కంటిన్యూగా ఇదే జాతికి చెందిన మరొక మగ పక్షి 12,200 కిలోమీటర్లు పయనించింది.మొన్నటిదాకా అత్యధిక దూరంపాటు పయనించిన పక్షిగా దీని పేరు మీద ఒక రికార్డు ఉంది.ఇప్పుడు ఆ రికార్డింగ్ ఈ ఆడ పక్షి చేరిపి వేసింది.ఈ జాతి పక్షుల్లో తమ ఆహారం కోసం శరీరంలోనే కొవ్వును దాచిపెట్టుకుంటాయి.కాగా 13000 కిలోమీటర్లకు పైగా పయనించిన పక్షి సగం వరకు బరువు తగ్గే ఉంటుందని నిపుణులంచిన వేస్తున్నారు కాగా ఇప్పుడు అది తాను చేరుకున్న ప్రదేశంలో నీటి పురుగులు తిని మళ్లీ బలం పుంజుకుంటదని సమాచారం.







