గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చెప్పారు.
ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో అరాచకం జరుగుతోందని ఆరోపించారు.ఇప్పటికే 70 అడుగులు రోడ్డు ఉంటే ఇంకా విస్తరణ ఏంటని పవన్ ప్రశ్నించారు.
వైసీపీకి ఓటు వేయని వారిని శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో ఆయన రేపు ఇప్పటంలో పర్యటించనున్నారు.
దీనిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను పవన్ పరామర్శించనున్నారు.