పురుషుడి వీర్యం ద్వారా మహిళల్లో ఆ సమస్యలకు వైద్యం .. డాక్టర్ల కొత్త టెక్నిక్

వీర్యాన్ని ఎప్పుడైనా మైక్రొస్కోప్ లో చూసారా? వీర్యకణాలు తమ తోక ఆడిస్తూ ఎలా పరుగులు తీస్తాయో గమనించారా? వీర్యంలో ఈ పరిగెత్తే లక్షణం ఉండటం వలనే అది స్త్రీ శరీరంలో చేరాల్సిన చోటుకి చేరి గర్భానికి కారణమవుతుంది.

వీర్య కణాలు వేగంతో ఈతకొట్టగలవు.

ఇప్పుడు వీర్యంలో ఉన్న ఇదే లక్షణాన్ని మహిళల్లో వచ్చే ఓ పెద్ద ఆరోగ్య సమస్యకు వైద్యంగా ఎలా వాడొచ్చు కనుగొన్నారు జర్మనీ శాస్త్రవేత్తలు.ఇది చదివితే అసలు ఇలాంటి క్రేజి ఆలోచన వారి మెదడుకి ఎలా తట్టిందబ్బా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు.


వీర్యం పరుగులు తీసి అండాన్ని చేరుతుంది కదా.మరి స్త్రీల గర్భాశయం దగ్గర ఎన్నోరకాల సమస్యలు వస్తాయి కదా.ముఖ్యంగా గైనోలాజికల్ క్యాన్సర్‌ లాంటి సమస్య వేలమందిని బాధపెడుతోంది కదా, ఇలాంటి సమస్యలకి వీర్యంతోనే ట్రీట్ మెంట్ చేయిస్తే ? అర్థం కాలేదా? ఈ క్యాన్సర్ టీట్ మెంట్ కోసం అందించాల్సిన మెడిసిన్స్ ఎటువంటి సర్జరీ చేయకుండా, వీర్యం ద్వారానే పంపిస్తే? ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, మెడిసిన్ ని వీర్యం ద్వారా యోనిలోంచి క్యాన్సర్ దాకా పంపిస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన ఇప్పుడు ఓ పెద్ద సంచలనం.
ఇప్పటికే ఈ కొత్త టెక్నిక్ మీద ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వీర్యంలోకి మెడిసిన్ ని ఎక్కించి, దాన్ని ట్యూమర్, క్యానర్ ఉన్న చోటికి అది మోసుకెళ్ళేలా టెక్నిక్ తీసుకొచ్చారు.అయితే వీర్యకణాలు ఎంత బరువుని మోయగలవు, ఎంత స్పీడుతో వెళ్ళగలవు అని విషయాలు మీద ఇంకా రిసెర్చి చేస్తున్నారు.

Advertisement

మందులని పెట్టడం వలన వీర్యకణాలు పరిగెత్తే స్పీడ్ 44% పడిపోతుందని శాస్త్ర్రవేత్తలు అంచనా వేస్తున్నారు.అందుకే వీర్యకణాలతో ఎంత బరువు మోయించవచ్చు, ఎన్నిరకాల మెడిసిన్స్ పంపించవచ్చు అని విషయం మీద ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.


అలాగే ఈ మెడిసిన్స్ కలపడం వలన పిండాన్ని ఫలీదకరించడం జరగదా జరుగుతుందా అనే దిశగా కుడా ఆలోచిస్తున్నారు.ఒకవేళ అలాంటి అవకాశమే లేకపోతే, గైనోలాజికల్ క్యాన్సర్ కి అద్భుతమైన ట్రీట్‌మెంటు దొరికేసినట్టే అంట.గర్భాశయంలో క్యాన్సర్, ట్యూమర్లతో బాధపడే వేలు, లక్షలాదిమంది మహిళలకి పురుషులు తమ వీర్యాన్ని దానం చేసి, వారికి సహాయం చేయవచ్చు.మరి సైంటిస్టులు ఈ టెక్నిక్ పై పూర్తి పట్టు సాధిస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు