వాగ్నర్‌ గ్రూపు బెలారస్‌లో తలదాచుకుందా?

వాగ్నర్‌ గ్రూపు( Wagner Group ) గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూపు గురించి వార్తల్లో విరివిగా కథనాలు వెలువడడం అందరికీ తెలిసినదే.

రష్యాలో వీరి తిరుగుబాటు సమయంలో బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో( Lukashenko ) మధ్యవర్తిత్వం చేసి వాగ్నర్‌ బృందాన్ని ఆపడం జరిగింది.ఆ తర్వాత రష్యా వాగ్నర్‌ బృందాలు బెలారస్‌లో తలదాచుకోవచ్చనే అవకాశం ఇచ్చింది.

దాంతో ఇపుడు దళాలు బెలారస్‌ కు చేరుకున్నట్టు కధనాలు వస్తున్నాయి.అక్కడ ఓ పాత సైనిక స్థావరంలో క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్నట్టు ఋజువులు కనిపిస్తున్నాయి.

మరో రెండు కాన్వాయ్‌లు కూడా బెలారస్‌ దిశగా వెళుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement

అంతేకాకుండా సుమారు 100కు పైగా ఉన్న వాహనాల్లో చాలా వాటిపై వాగ్నర్‌ పతాకాలున్నట్టు తెలుస్తోంది.రష్యాలో( Russia ) తిరుగుబాటు విఫలమయ్యాక వాగ్నర్‌ దళాలు తొలిసారి బహిరంగంగా కనిపించడం కొసమెరుపు.మరో 200 వాహనాలు కూడా బెలారస్‌( Belarus ) దిశగా వెళుతున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌కు చెందిన అత్యంత కీలకమైన ఒడెసా ఓడరేవు నగరంపై రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి విదితమే.కెర్చ్‌ వంతెనపై దాడి జరిగిన 24 గంటల్లో మాస్కో ఈ దాడులు చేయడం కూడా తెలిసినదే.

కల్బిర్‌ క్షిపణులు, ఇరాన్‌కు చెందిన డ్రోన్లను ఈ దాడుల్లో వాడినట్టు తెలుస్తోంది.ఆరు కల్బిర్‌ క్షిపణులు, 31 డ్రోన్లను, ఒక మానవరహిత నిఘా విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసిందని ఉక్రెయిన్‌ పేర్కొంది.

అయితే రష్యా ఫ్రిగేట్ల నుంచి వీటిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌( Ukraine ) అధికారులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.రష్యా నల్ల సముద్ర ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలగడం 40 కోట్ల మందిపై పెను ప్రభావం చూపుతుందని, వీరంతా ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతులపై ఆధారపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఇక ఉక్రెయిన్‌ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్‌ టెలిగ్రామ్‌ ఛానెల్లో మాట్లాడుతూ.ప్రజలను ఆకలితో చంపడమే రష్యా లక్ష్యమని ప్రపంచం ఖచ్చితంగా తెలుసుకోవాలి.భారీ ఎత్తున వలసలు జరగాలని వారు కోరుకొంటున్నారు.

Advertisement

పశ్చిమ దేశాలను బలహీన పర్చడానికి అదొక మార్గంగా ఎంచుకొన్నారు అని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు