పంచాయతీలో మహిళ కాళ్లు పట్టుకున్న సర్పంచ్ భర్త..!

ఒంటరిగా ఉన్న మహిళపై కన్నెసిన ఓ సర్పంచ్ భర్త ఆమెకు దగ్గరవ్వాలని పన్నాగం పన్నాడు.తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు.

పలుమార్లు ఆ మహిళ మందలించినా వినలేదు.దక్కించుకోవాలని నెపంతో తరచూ ఆమెను ఫోన్ చేసి వేధించేవాడు.

దీంతో విసుగు చెందిన మహిళ గ్రామ పెద్దలకు సమాచారం అందించింది.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టి తీర్పు ఇచ్చారు.

తీర్పులో బాధిత మహిళ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని అనడంతో సర్పంచ్ భర్త ఆమె కాళ్లు పట్టుకున్నాడు.ఈ సంఘటనను ఓ యువకుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హందాపూర్ కి చెందిన గ్రామ సర్పంచ్ భర్త సుదర్శన్ ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేశాడు.

లొంగదీసుకోవాలని నెపంతో తరచూ ఫోన్లు చేసి సతాయించేవాడు.దీంతో విసుగు చెందిన మహిళ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది.

గ్రామ పెద్దలు మహిళ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పమని తీర్పు ఇచ్చారు.దీంతో సుదర్శన్ బాధితురాలి కాళ్లను పట్టుకుని క్షమించమని కోరాడు.

ఇంకెప్పుడు మహిళపై వేధింపులకు పాల్పడిన, ఆమె జోలికి వెళ్లినా కఠినంగా శిక్షిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు