17వ పోలీస్ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి( Sardar Vallabhbhai Patel ) (జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ యస్.

శ్రీనివాస రావు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

అనంతరం బెటాలియన్ పోలీస్( Battalion police ) అధికారులు, సిబ్బంది అందరి చేత కమాండెంట్ ప్రతిజ్ఞ చేయించారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చర్యలు మరియు సూచనల ద్వారా భారతదేశం యొక్క ఏకీకరణకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

నా దేశం యొక్క అంతర్గత ,శాంతి భద్రతలకు నాయొక్క సహాయ సహకారాలు అందిస్తానని , నా దేశం యొక్క ఐక్యతకు పాటుపడుతూ దేశ భద్రతకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నా ప్రతిజ్ఞ" అని ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కమాండెంట్ గారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడుగా, భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్ గా భారతదేశానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాచరిక సంస్థానాల విలీనంలో వల్లభాయ్ పటేల్ గారు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్, జూనాగడ్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు అని పేర్కొన్నారు.

దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాష్ నారాయణ , యమ్.పార్థసారథి రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.శైలజ( Sailaja ) ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News