బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పదేళ్ల పాలనలో రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు.
అవినీతి ఆరోపణలు రావడంతోనే బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఆ పార్టీ హైకమాండ్ తొలగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.కనీసం తల్లికి గౌరవం ఇవ్వని అవివేకి బండి సంజయ్ అని విమర్శించారు.
బండి సంజయ్ నిజమైన భక్తుడు అయితే గుళ్లకు ఏం చేశారని ప్రశ్నించారు.మోదీ( Narendra Modi ) పాలనలో అదానీ, అంబానికే లాభం జరిగిందని తెలిపారు.
ఇటు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కేవలం ఒక్క కాంగ్రెస్ కే సాధ్యమని స్పష్టం చేశారు.