టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మల్టీస్టారర్ చిత్రంలో హీరోలుగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఆలియా భట్ నటిస్తుండగా, కీలక పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నట్లుగా స్వయంగా రాజమౌళి ప్రకటించాడు.
ఇంకా చిత్రంలో ప్రముఖ నటీనటులు కూడా కనిపించబోతున్నట్లుగా తాజాగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ముఖ్యంగా ఈ చిత్రంలో సంజయ్ దత్ ఉంటాడనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ను ఆర్‌ఆర్‌ఆర్ మల్టీస్టారర్‌లో పార్ట్ చేయడం వల్ల బాలీవుడ్‌లో క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.ఆయనకు భారీ పారితోషికం ఇచ్చి చిన్న పాత్రను చేయించేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు.
సౌత్ మూవీలో నటించేందుకు ఆయన ఆసక్తిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఆయన కేజీఎఫ్ 2 చిత్రంలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ కోసం కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఈ మల్టీస్టారర్‌లో సంజయ్ దత్ ఉంటే ఖచ్చితంగా మార్కెట్ మరింతగా పెరగడం ఖాయం.భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలి అంటే రాజమౌళి కంటెంట్‌తో పాటు, అందకు తగ్గ నటీనటులు కూడా అవసరం.అందుకే బాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించుతూ ఈ సినిమాను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.