సర్దార్‌లో నేను రాజకుమారిని

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’.ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

కాజల్‌తో పాటు ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మి మరియు సంజనలు కూడా నటిస్తున్నారు.రాయ్‌ లక్ష్మి ఐటెం సాంగ్‌లో మెరువనుండగా, సంజన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ సంచన తెగ ఫీల్‌ అయిపోతోంది.

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో తాను పోషిస్తున్న పాత్రను గతంలో ఎప్పుడు పోషించలేదు అని, తప్పకుండా ఈ చిత్రం తనకు ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని చెప్పుకొచ్చింది.

Advertisement

ఈ చిత్రంలో తనది రాజకుమారి వంటి పాత్ర అని, సినిమాలో చాలా కీకమైన పాత్రలో తాను నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ సంజన చెప్పుకొచ్చింది.ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించిన సంజనకు సరైన గుర్తింపు దక్కలేదు.

కాని త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాతో గుర్తింపుతో పాటు మరిన్ని ఆఫర్లు కూడా రావడం ఖాయంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు