దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి అందరికీ తెలిసిందే.టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా కు దర్శకత్వం వహించి తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా.
ఆ తరువాత బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు రీమేక్గా సినిమా తెరకెక్కించి అక్కడ కూడా సంచలన విజయాలు సృష్టించారు సందీప్ వంగా.ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ టీమ్ తో కలసి ఒక ఇంటర్వ్యూ చేశాడు సందీప్ రెడ్డి.
ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలు రెండు సార్లు చూశానని, ఇక ముచ్చటగా మూడోసారి కూడా చూడబోతున్నాను అని తెలిపారు.
అలాగే ఈ సినిమాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనీసం రెండు సార్లు చూడాలని, వీలైతే మూడోసారి నాలుగోసారి కూడా చూడాలి అని తెలిపాడు సందీప్ రెడ్డి.ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాల కోసం, అలాగే ఇంటర్వెల్ మిగతా సన్నివేశాల కోసం ఈ సినిమా పలు సార్లు చూడాలి అంటూ సందీప్, అభిమానులకు సూచిస్తున్నాడు.
అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను చూసిన సందీప్ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా విడుదలైన మొదటి రోజే భారీగా కలెక్షన్లు రాబట్టింది.
అంతేకాకుండా ఈ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది.
ఈ సినిమాలో నటీనటుల నటన గాను ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమా విడుదల కాకముందు ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.







