సీక్రెట్ గా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ నిశ్చితార్థం.. నెట్టింట్లో ఫోటోలు వైరల్!

హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

 Hero Aadhi Pinisetty Got Engaged With Nikki Galrani, Aadi Pinishetty, Nikki Galr-TeluguStop.com

గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట తాజాగా ప్రేమ విషయంలో ఒక అడుగు ముందుకు వేశారు.తాజాగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది.

ఈ మేరకు తాజాగా ఆది పినిశెట్టి వారి ప్రేమ విషయం గురించి, వారి మధ్య ఉన్న బంధం గురించి అధికారికంగా ప్రకటన చేశాడు.అంతేకాకుండా నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆది పినిశెట్టి ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు.జీవితంలో ఒకరిని ఒకరు పట్టుకొని నడవడం అతి ముఖ్యమైనది.తన జీవితాంతం ఉండగలం అనే విషయాన్ని మేమిద్దరం గత కొన్నాళ్ల క్రితమే కనుగొన్నాము.ఇప్పుడు అది అధికారకమైంది.24.03.2022 ఈ రోజు మాకు ఎంతో ప్రత్యేకమైన రోజు.ఎందుకంటే ఈ రోజున మా కుటుంబ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది.మా ఈ కొత్త జర్నీకి మీ అందరికీ ఆశీర్వాదం మాకు కావాలి అంటూ ట్వీట్ చేసాడు ఆది పినిశెట్టి.

అది చేసిన ట్వీట్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే నిశ్చితార్థం ముందు వరకు కూడా ఆది పినిశెట్టి,నిక్కీ గల్రానీ ప్రేమ విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.ఇద్దరు కలిసి మలుపు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఆది ఇంట్లో జరిగే ఈవెంట్ ఫంక్షన్లకు నిక్కీ గల్రానీ తప్పకుండా వచ్చేది.దీంతో వీరి ప్రేమ విషయం లో వినిపిస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం చేస్తూ చివరికి ఈ జంట ఒక్కటయ్యారు.

ఈ జంట నిశ్చితార్థం ఫోటోలు చూసిన అభిమానులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube