ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్.. డార్లింగ్ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగ!

బాహుబలి సినిమాతో( Baahubali movie ) ఒక్కసారిగా ప్రభాస్ ( Prabhas )రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.ఈ సినిమా తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించి భారీ సినిమాలను లైన్లో పెట్టాడు.

 Sandeep reddy vanga Interesting Comments On Prabhas Spirit Movie, Spirit Movie-TeluguStop.com

ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉండగా వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో డార్లింగ్ ఉన్నాడు.

ఇప్పటికే ఆదిపురుష్ వంటి సినిమాను రిలీజ్ చేయగా డిసెంబర్ లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఆ తర్వాత కూడా ఈయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.కల్కి సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ఓకే సినిమా ఉంది.

ఈ సినిమాలతో పాటు డార్లింగ్ లైనప్ లో మరో సినిమా ఉన్న విషయం విదితమే.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో ఎప్పుడో ఒక సినిమా ప్రకటించాడు.స్పిరిట్ అనే టైటిల్( Spirit Movie ) ను కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.అయితే తాజాగా ఈ సినిమా గురించి సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈయన బాలీవుడ్ హీరో రణబీర్ తో చేసిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే ఈయన ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

ఈ సందర్భంగా సందీప్( Sandeep Reddy Vanga ) ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడారు.ఈ సినిమా 2024 సెప్టెంబర్ నుండి పట్టాలెక్కుతుందని.

ఇందులో ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలిపారు.ఈ కామెంట్స్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube