ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్.. డార్లింగ్ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగ!

బాహుబలి సినిమాతో( Baahubali Movie ) ఒక్కసారిగా ప్రభాస్ ( Prabhas )రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.

ఈ సినిమా తర్వాత డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించి భారీ సినిమాలను లైన్లో పెట్టాడు.

ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉండగా వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో డార్లింగ్ ఉన్నాడు.

"""/" / ఇప్పటికే ఆదిపురుష్ వంటి సినిమాను రిలీజ్ చేయగా డిసెంబర్ లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక ఆ తర్వాత కూడా ఈయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.

కల్కి సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ఓకే సినిమా ఉంది.ఈ సినిమాలతో పాటు డార్లింగ్ లైనప్ లో మరో సినిమా ఉన్న విషయం విదితమే.

"""/" / అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో ఎప్పుడో ఒక సినిమా ప్రకటించాడు.

స్పిరిట్ అనే టైటిల్( Spirit Movie ) ను కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి సందీప్ వంగ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈయన బాలీవుడ్ హీరో రణబీర్ తో చేసిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే ఈయన ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.ఈ సందర్భంగా సందీప్( Sandeep Reddy Vanga ) ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడారు.

ఈ సినిమా 2024 సెప్టెంబర్ నుండి పట్టాలెక్కుతుందని.ఇందులో ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలిపారు.

ఈ కామెంట్స్ తో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వైరల్ వీడియో: కొడుకు మొండితనానికి తండ్రీకొడుకులను విమానం నుంచి దించేసిన విమాన సిబ్బంది..