నా కోడలు విషయంలో పొరపాటు చేశాను.. సనా సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సనా( Sana ) తక్కువగానే సినిమాలు చేస్తున్నా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తక్కువ కాదనే సంగతి తెలిసిందే.సనా కోడలు పేరు సమీరా( Sameera ) కాగా సమీరాకు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Sana Sensational Comments About Sameera Details Here Goes Viral ,  Sana, Sameera-TeluguStop.com

తమిళం, మలయాళం, కన్నడలో కూడా చేశానని సనా వెల్లడించారు.కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా సమయంలో చేదు అనుభవం ఎదురైందని ఆమె అన్నారు.

<సినిమాలలో ప్రాంప్టింగ్ ఉండదని సనా తెలిపారు.కన్నడ ఇండస్ట్రీలో ఇతర భాషల నటీమణులకు ప్రాధాన్యత ఇవ్వడం నచ్చదని ఆమె చెప్పారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి భద్ర మూవీలో యాక్ట్ చేశానని సనా తెలిపారు.ప్రాధాన్యత ఉన్న పాత్రలకు నేను ఎక్కువగా ఓకే చెబుతానని ఆమె వెల్లడించారు.

ప్రాధాన్యత లేకపోయినా కొన్ని సినిమాలలో నటించానని సనా వెల్లడించడం గమనార్హం.

పెద్ద బ్యానర్లు, పెద్ద హీరోల సినిమాలలో కొన్నిసార్లు నటించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.అలాంటి వాళ్లు పిలిచి ఛాన్స్ ఇస్తామంటే ఎందుకు వద్దని అనిపిస్తుందని సనా వెల్లడించారు.టబు, నయనతార, సమంత, కాజల్, తాప్సీ హీరోయిన్లంతా స్వీట్ అని ఎవరూ ర్యూడ్ గా ఉండరని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు ఇండస్ట్రీలో మేఘన మంచి ఫ్రెండ్ అని సనా పేర్కొన్నారు.నా కొడుకు లవ్ స్టోరీ పెద్ద కథ అని ఆమె తెలిపారు.సమీరా ఫేస్ బుక్ లో నా కొడుకు బర్త్ డే అని చూసి తన తరపున విషెస్ చెప్పాలని కోరగా నువ్వే చెప్పు అని ఫోన్ నంబర్ ఇచ్చానని అదే నేను చేసిన పొరపాటు అని సనా అన్నారు.ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి అయిందని సనా వెల్లడించారు.

వాళ్లు చాలా సమయం తీసుకొని పెళ్లి చేసుకున్నారని సనా చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube