టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సిట్ అధికారులు వంద మార్కులు దాటిన అభ్యర్థుల జాబితాను తయారు చేశారని సమాచారం.
ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ఫోన్లు చేసి విచారణకు రావాలని పిలుస్తున్నారు.అభ్యర్థుల నుంచి సుమారు 15 అంశాలపైఅధికారులు వివరాలను సేకరిస్తున్నారు.
బయోడేటా తో పాటు ఇంతకుముందు పరీక్షలు రాశారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.అవసరమైతే మళ్లీ సంప్రదిస్తామని అధికారులు క్యాండిడేట్స్ కు తెలిపారు.
ఈ క్రమంలోనే రేపు సీట్ అధికారులు ఎదుట కొంతమంది అభ్యర్థులు హాజరుకానున్నారు.మరోవైపు ఈ కేసులో మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.