వివాహేతర సంబంధం ఎప్పటికీ మూన్నాళ్ళ ముచ్చటే.పెళ్లి కానీ వారు, పెళ్లి అయిన వారు అనే తేడా లేకుండా ఎదుటి వ్యక్తి ఆకర్షణకు లోనై, రెండు క్షణాల శారీరక సుఖం కోసం తప్పటడుగు వేసి సమాజంలో పరువు పోగొట్టుకోవడంతోపాటు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ప్రతిరోజు ఇలాంటి దారుణాలను చూడడం, వినడం చేసినా కూడా మార్పు అనేది రావడం లేదు.ఆకర్షణతో మొదలైన వివాహేతర సంబంధాలు చివరికి దారుణాలతో ముగుస్తున్నాయి.
ఓ పెళ్లయిన మహిళకు, ఓ పెళ్లి కానీ యువకునికి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.సమయం దొరికినప్పుడల్లా ఏకాంత ప్రదేశంలో కలుసుకొని ఎంజాయ్ చేయడం వీళ్ళ అలవాటు.
ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తు మహిళ యొక్క అత్తింటి వారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.యువకుడిని కట్టేసి నాలుక కోసి పంపించారు.
పోలీసుల కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh )లోని సోన్ భద్ర జిల్లా పరిధిలో ఉండే సలైయాదీ గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు హర్యానాలో ఉద్యోగం చేసేవాడు.అనిల్ కు జార్ఖండ్ లోని గాడ్వా ప్రాంతానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధాని( Affair )కి దారితీసింది.
ఇద్దరు కలిసి హర్యానాలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఏకంగా కాపురం పెట్టేశారు.వివాహిత అత్తింటి వారు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు( police ) ఆమెను తిరిగి భర్తకు అప్పగించారు.
కొంతకాలం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలుసుకోవడం ప్రారంభించారు.కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి, వీరిపై నిఘా పెట్టి ఆదివారం రాత్రి ప్రియురాలిని కలిసేందుకు వచ్చినా అనిల్ ను పట్టుకుని చెట్టుకు కట్టేసి నాలుక కోసి పంపించారు.
అనిల్ ఏలాగోలా ఇంటికి చేరుకుంటే, నోటి నుండి రక్తం రావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఇతడి నాలుకను రెండు నుంచి మూడు అంగుళాల మేర కత్తిరించినట్లు వైద్యులు తెలిపారు.వైద్యులు శాస్త్ర చికిత్స చేసి కుట్లు వేశారు.అనిల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్న మాట్లాడడానికి మరింత సమయం పడుతుంది.
అనిల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.