శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్( Samsung Galaxy M15 5G smartphone ) ముందస్తు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ భారత మార్కెట్ లో విడుదల కానుంది.

 Samsung Galaxy M15 5g Smartphone Pre Bookings Start What Are The Features-TeluguStop.com

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.4GB RAM+128GB స్టోరేజ్( 4GB RAM+128GB Storage ) వేరియంట్ ధర రూ.13499 గా ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.అయితే రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకుంటే.రూ.1699 విలువైన అప్పు 25W చార్జర్ రూ.299 కే కొనుగోలు చేయవచ్చు.అంతేకాదు HDFC క్రెడిట్ కార్డు ద్వారా బుకింగ్ చేసుకుంటే ఏకంగా మూడు నెలల పాటు కస్టమర్లు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు.

శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే( AMOLED display ) తో వస్తోంది.వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో ఉంటుంది.ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాలతో ఉంటుంది.50ఎంపీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ కెమెరాతో నాణ్యమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఏకంగా నాలుగు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్డేట్ లను పొందవచ్చు.అంతేకాదు ఐదు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్ డేట్ లను పొందవచ్చు.ఇక ఈ ఫోన్ కు సంబంధించిన మిగతా ఫీచర్ల వివరాలు లాంచింగ్ సమయంలో వెలువడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube