ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా రాధాకిషన్ రావును రెండో రోజు కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
మొదటి రోజు కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావును సుమారు 6 గంటలకు పైగా విచారించారు.ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రాధాకిషన్ రావు( Radhakishan Rao ) డబ్బులు రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
ఎస్ఐబీ కార్యాలయం( SIB office )లో ప్రణీత్ రావు ( Praneeth Ra )ఆధారాలను ధ్వంసం చేయడంలోనూ రాధాకిషన్ రావు సాయం చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించారు.రాజకీయ నేతలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ ను రాధాకిషన్ రావు తయారు చేశారని సమాచారం.రాధాకిషన్ రావు ఇచ్చే సమాచారంతో మరి కొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.