యశోద సినిమా కోసం ఐదుగురు స్టార్ హీరోలు.. మూవీ సక్సెస్ అవుతుందా?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం యశోద.సినిమా పూర్తి అయ్యి చాలా రోజులు అయినప్పటికీ చిత్రబృందం మాత్రం ఈ సినిమాను ఇంకా విడుదల చేయలేదు.

 Samanthas Yashoda Trailer To Be Unveiled By Vijay Deverakond , Samantha, Tollywo-TeluguStop.com

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇప్పటికే సినిమా పై భారీగా అంచనాలకు నెలకొన్నాయి.

ఇటీవల విడుదలైన టీజర్ తో అంచనాలు మరింత పెరిగాయి.ఇది ఇలా ఉంటే తాజాగా యశోద సినిమాకు సంబంధించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొనడంతో అందుకు తగ్గట్టుగా ఉండటం కోసం ఈ సినిమా ట్రైలర్ ను ఐదుగురు స్టార్ హీరోలతో లాంచ్ చేయబోతున్నారట.

నవంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమాను తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు చిత్ర బృందం.ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది.

Telugu Samantha, Tollywood, Yashoda Trailer-Movie

అలాగే ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్,ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాకు హరీష దర్శకత్వం వహించిన విషయం తెలిసింది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు అనగా అక్టోబర్ 27న సాయంత్రం 5:36 నిమిషాలకు విడుదల చేయనున్నారు.ఆ స్టార్ హీరోలు ఎవరు అన్న విషయానికి వస్తే.తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో హీరో సూర్య, కన్నడలో హీరో రక్షిత్ శెట్టి, మలయాళం లో హీరో దుల్కర్ సల్మాన్, హిందీలో హీరో వరుణ్ ధావన్లు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కాగా భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube