సమంత మూడు పచ్చ బొట్లు మాయం.. అలాంటి ఆలోచనే వద్దంటా!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం సమంత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇది ఇలా ఉంటే చాలా కాలం తర్వాత సమంత తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించింది.ఈ నేపథ్యంలోనే తన అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది సమంత.

థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏది అని ఒక నెటిజన్ ప్రశ్నించగా. జురాసిక్ పార్క్ అంటూ సమాధానం ఇచ్చింది సమంత.

ఆ తర్వాత మరొక నెటిజెన్ సమంత మొదటి సంపాదన గురించి ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన సమంత హోటల్లో హోస్ట్ గా ఎనిమిది గంటలు పని చేసినందుకు 500 రూపాయలు ఇచ్చారు అని చెప్పుకొచ్చింది.

Advertisement

అనంతరం అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని అడగగా.మీ పైన మీరు పూర్తిగా నమ్మకం పెట్టుకోండి.

మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అని సమాధానమిచ్చింది.ఇంతలో మరొక నెటిజన్‌ మీరు ఎప్పటికైనా వేయించుకోవాలి అనుకున్న టాటూలు ఏమైనా ఉన్నాయా అని అడగగా కొద్ది సేపు ఆలోచించిన సమంత, తాను అసలు టాటూలు వేయించుకోకూడదు అని అనుకున్నానని అలాంటి ఆలోచన ఉంటే తక్షణమే మానుకోండి అని అభిమానులకు తెలిపింది.

సమంత గతంలో మూడు టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే.

ఏం మాయ చేసావే సినిమా సమయంలో గుర్తుగా వైఎంసి అనే అక్షరాలను వీపు పై పచ్చబొట్టుగా వేయించుకుంది.అదేవిధంగా నడుము భాగంలో చై అనే పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది.కుడి చేతి మీద 2 యారో మార్కులను టాటూ వేయించుకోగా అదే టాటూ చైతన్య కుడి చేతికి కూడా ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇకపోతే గత ఏడాది అక్టోబర్ లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని వెళ్లిపోయిన విషయం తెలిసిందే.విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ గా ఉంటాను అని ప్రకటించినప్పటికీ ఇద్దరూ ఎవరికీ ఏమీ కానట్టు గా వ్యవహరిస్తూ కెరీర్ పై దృష్టి పెట్టారు.

Advertisement

అంతేకాకుండా బర్తడే లకి కనీసం ఒకరి కొకరు విషెస్ కూడా చేసుకోవడం లేదు.విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.

నిత్యం ఏదో రకమైన కొటేషన్ లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తరచుగా నిలుస్తూనే ఉంది.

తాజా వార్తలు