ఏం చేసినా ఎలా చేసినా సమంత( Samantha) మీద ఒక మాట అనేస్తే పోలా.ఒక వార్త రాసేస్తే పోలా అన్నట్టుగా మీడియా పరిస్థితి కనబడుతుంది.
ఆల్రెడీ పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులతో కెరీర్ కొనసాగిస్తున్న సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా చాలెంజ్ లను ఎదుర్కొంటుంది.ప్రస్తుతం సమంత అటు బాలీవుడ్ వెబ్ సీరీస్ లతో పాటుగా సినిమాలు చేస్తుంది.
తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషి( Kushi movie ) సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలతో సమంత మరోసారి తన సత్తా చాటనుంది.

సినిమాల కన్నా సమంత సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.ప్రస్తుతం ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత మీడియా తన మీద రాస్తున్న వార్తలను కూడా పట్టించుకోవడం మానేసింది.సమంత ఏం చేసినా అదో పెద్ద న్యూస్ అన్నట్టుగా రాసే వాళ్లు ఉన్నారు.అయితే ఒకప్పుడు వీటి గురించి బాగా ఆలోచించి టెన్షన్ పడిన సమంత ఇప్పుడు ఆ వార్తలను సైతం లైట్ తీసుకుంటుంది.
సమంత లో ఈ మార్పు ఆమె ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.యూఎస్ కి ట్రీట్ కోసం వెళ్తుంది అన్న వారికి ఆమె పెడుతున్న ఫోటోలు షాక్ ఇస్తున్నాయి.







