చంద్రబాబు, పవన్ లపై మంత్రి రోజా సీరియస్ కామెంట్స్..!!

రెండో దశ వారాహి విజయ యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కాక రేపుతున్నాయి.ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా ఆలోచన చేస్తూ ఉండగా మరోపక్క పవన్ కళ్యాణ్ పై విజయవాడకు చెందిన వాలంటీర్ విజయవాడ సివిల్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయడం జరిగింది.

 Minister Roja's Serious Comments On Chandrababu Pawan Minister Roja, Chandrabab-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే ఇదే విషయంపై తాజాగా తిరుపతిలో మాట్లాడిన వైసీపీ మంత్రి రోజా( Minister Roja ) కీలక వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.పవన్ కి చిన్న మెదడు చితికిందని.అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇదే సమయంలో చంద్రబాబు( Chandrababu naidu ) పై కూడా విమర్శలు చేశారు.చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువైందని అన్నారు.

చాలామంది వాలంటీర్లుగా పని చేస్తూనే చదువుకుంటున్నారని.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube