స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తన సోషల్ మీడియాలో లేటెస్ట్ గా ఒక కామెంట్ పెట్టింది.ఆ కామెంట్ ఏంటి అంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ.
భగవద్గీతలోని ఈ విషయాన్ని సమంత ఇప్పుడు ఎందుకు చెప్పడం వెనక కారణం ఏంటి అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
అసలు ఇంతకీ సమంత పెట్టిన దానికి అర్ధమేంటి అంటే నువ్వు పని చేసుకుంటూ వెళ్లి పని చెయ్యడం మీదే అధికారం ఉంది దాని ఫలితం మీద కాదు.ఫలితానికి నువ్వు కారణం కాదు అలాగని పని చేయడం మాన కూడదు.ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి అని దానర్ధం.
ఇటీవల శాకుంతలం( Shaakuntalam ) సినిమా ఎన్నో భారీ అంచనాలతో రాగా ఆ సినిమా ఫలితం నిరాశపరచింది.అయితే ఆ సినిమా రిజల్ట్ గురించే సమంత ఇలా కామెంట్ పెట్టిందని చెప్పుకుంటున్నారు.
సినిమా చేయడం వరకే తన పని ఫలితం ఏంటన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదు.ఆశించిన విధంగా ఫలితం రాకపోతే పని ఆపాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే సమంత ఈ కామెంట్ పెట్టినట్టు ఉందని చెప్పొచ్చు. ఫలితం ఎలాంటిదైనా దాన్ని స్వీకరించి ముందుకెళ్లాలి అంటూ సమంత పెట్టిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.