జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న రచ్చ రవి(Raccha Ravi) ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్నారు.తాజాగా ఈయన నటించిన బలగం సినిమా(Balagam Movie) ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ సినిమాలో రచ్చ రవి చెప్పే డైలాగ్ ఆగుతావ రెండు నిమిషాలు అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది.ఇక ఈ డైలాగుల గురించి రచ్చ రవి మాట్లాడుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా రచ్చ రవి మాట్లాడుతూ తనకు బలగం సినిమాలోని ఆగుతావా రెండు నిమిషాలు అనే డైలాగ్ ఎంతో మంచి పేరు తెచ్చిందనీ తెలిపారు.అయితే కరెక్ట్ గా 10 సంవత్సరాల క్రితం తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే డైలాగ్ కూడా తనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలోని ఇందుకు కారణమైనటువంటి వేణు(Venu) చమ్మక్ చంద్రలకు(Chammak Chandra) ఈయన కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా రవి స్పందిస్తూ ఏమి ఇవ్వగలను మీకు సరిగా పది సంవత్సరాల క్రితం మార్చి నెలలో చమక్ చంద్ర అన్న స్కిట్ లో చేస్తూ తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాను.తిరిగి పది సంవత్సరాలకు అదే మార్చి నెలలో బలగం సినిమా ద్వారా ఆగుతావా రెండు నిమిషాలు అనే డైలాగ్ ద్వారా గుర్తింపు వచ్చింది.ఇలా ఈ రెండు డైలాగులు(Two Dialogues) తన జీవితాన్ని మార్చేసాయి అంటూ రచ్చ రవి ఎమోషనల్ అయ్యారు.

10 సంవత్సరాల క్రితం తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే డైలాగు చెప్పిన తర్వాత మల్లెమాలవారికి ఫోన్ చేసి తన ఫోన్ నెంబర్ తీసుకొని ఎంతోమంది ఫోన్ చేసి తనకు ప్రశంసలు కురిపించారని తెలిపారు.ఇప్పుడు కూడా బలగం సినిమా ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఆగుతవ రెండు నిమిషాలు అనే డైలాగ్ ద్వారా మరింత గుర్తింపు వచ్చిందని ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఫోన్లు చేసి తనకు ప్రశంసల కురిపిస్తున్నారని తెలిపారు.ఇలా ఈ రెండు డైలాగులతో తనకు లైఫ్ ఇచ్చిన మీ ఇద్దరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.నా బలం.బలగం అయినటువంటి శ్రేయోభిలాషులందరికీ పూర్తిగా కృతజ్ఞతలతో నమస్కరిస్తూ… భవిష్యత్తులో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయబోతున్నానని.ఎల్లప్పుడు మీ ఆశీర్వాదాలు నాపై ఉండాలని కోరుకున్నారు.







