నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సలేశ్వరం జాతర ఇకపై రోజు జరగనుంది.ఈ మేరకు త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
నింగి నుంచి నేలకు జాలువారుతున్న తీరులో సలేశ్వరం క్షేత్రం వద్ద సుమారు మూడు వందల అడుగుల ఎత్తు నుంచి జలపాతం గుండంలోకి చేరుతుంది.అత్యంత ప్రమాదకర కొండ చరియలపై నడుస్తూ లింగమయ్య లోయకు భక్తులు చేరుకోవాలి.
నల్లమలలోని రెండు కొండల మధ్య వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు.ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో ఐదు రోజులపాటు ఈ జాతరను నిర్వహించేవారు.
అయితే అటవీ ప్రాంతం కావడం కారణంగా గత రెండేళ్లుగా మూడు రోజులపాటే నిర్వహిస్తూ వస్తున్నారు అధికారులు.భక్తుల కోరక మేరకు ఇక నుంచి ప్రతిరోజు సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు అధికారులు అనుమతిని ఇచ్చారు.
ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు.ఈ సలేశ్వరం క్షేత్రం వద్ద ఆదివాసీలే పూజారులుగా కొనసాగుతున్నారు.
ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.








