సమంత శాకుంతలం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఆశ్చర్యపర్చుతున్నాయి

సమంత కీలక పాత్రలో గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

వచ్చే నెల 17వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు అంటూ మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ తో చెప్పకనే చెప్పారు.ఈ సినిమా ను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.

ఆ కారణంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

ఇక ఈ సినిమా లో సమంత యొక్క లుక్ మరియు కథ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.అంతే కాకుండా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమంత కు ఇది కచ్చితంగా అత్యంత కీలకమైన సినిమా.

Advertisement

ఇటీవల విడుదల అయిన యశోద సినిమా తో సమంతకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సమంత అనారోగ్యంతో ఒక్క రోజు ప్రమోషన్ లో పాల్గొన్నా కూడా మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి.ఇక శాకుంతలం సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.అందుకే తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా శాకుంతలం సినిమాకు మంచి బిజినెస్ జరిగింది.

ముఖ్యంగా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

అదే కనుక నిజం అయితే చాలా గొప్ప విషయం.మొత్తం ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ తో నిర్మాతలకు 50 కోట్ల వరకు వచ్చాయట.ఇక సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ 50 కోట్లు కాస్త వంద కోట్లు అయినా ఆశ్చర్యం లేదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

హీరోయిన్‌ గా సమంత గతంలో ఎన్నో సినిమా ల్లో నటించింది.కనుక ఈ సినిమా మరింతగా ఆమెకు విజయాన్ని తెచ్చి పెడుతుందేమో చూడాలి.వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేస్తున్న శాకుంతలం సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు