శాకుంతలం భారం మొత్తం దిల్ రాజు మీదే... సమంత కెరీర్ కి కీలకం

సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం( Shaakuntalam ) చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

గత వారం విడుదలైన రావణాసుర అంతగా ఆకట్టుకోక పోవడంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఒకవేళ సమంత( samantha ) ఈ చిత్రం తో సక్సెస్ సొంతం చేసుకుంటే భారీ కలెక్షన్స్ దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వారు మాట్లాడుకుంటున్నారు.సమంత శాకుంతలం చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఇప్పుడు అవన్నీ కాకుండా కేవలం దిల్ రాజు విడుదల చేయబోతున్న తీరు ను బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉండబోతోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు కాస్త కష్టపడి మంచి థియేటర్స్ లో సినిమా ను విడుదల చేస్తే శాకుంతలం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు కామెంట్స్ చేస్తున్నారు.ఈ విషయమై ఇప్పటి వరకు దిల్ రాజు ప్రమోషన్ విషయంలో చాలా అగ్రెసివ్‌ గా వ్యవహరిస్తున్నారు.అంతే కాకుండా తన సినిమా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

కనుక ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి పెరుగుతుందని.తప్పకుండా సినిమా చూసేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున తరలి వస్తారని నమ్మకాన్ని చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు ( Dil Raju )విడుదల చేయబోతున్న సినిమా కనుక మినిమం కలెక్షన్స్ నమోదవడం ఖాయం.

అదే నిజమైతే కచ్చితంగా ముందు ముందు శాకుంతలం సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో పెద్ద విజయం గా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు