సమంతతో కలిసి నటించేందుకు రానా నో చెప్పాడట!

సమంత( Samantha ) హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా( Sakunthalam movie ) రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా లో దుశ్యంత మహారాజు పాత్రలో మలయాళం నటుడు దేవ్ మోహన్( Dev Mohan ) నటించాడు.

ఆ పాత్ర ను తెలుగు స్టార్ హీరోల్లో ఎవరైనా నటించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.తెలుగు హీరోలు కాకుండా మలయాళం నటుడిని తీసుకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ కొందరు ఈ సమయం లో ప్రశ్నిస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్ర కోసం తెలుగు లో ముగ్గురు నలుగురు యంగ్ స్టార్ హీరోలను దర్శకుడు గుణశేఖర్( Gunasekhar ) సంప్రదించాడట.కానీ వారు ఆ పాత్ర ను చేసేందుకు అంగీకరించ లేదు.పైగా సమంత ఇటీవల నాగచైతన్య నుండి విడి పోయింది కనుక ఆమె తో నటించేందుకు ఆసక్తిగా లేము అంటూ వారు తెల్చి పారేశారట.

గతంలో సమంత తో రానా కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే ఆయన ను ఈ సినిమా లో నటింపజేసేందుకు దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నించాడు.తన గత చిత్రం రుద్రమదేవి సినిమా లో కూడా రానా కీలక పాత్రలో నటించాడు.

Advertisement

కనుక ఈసారి ఒప్పుకుంటాడని దర్శకుడు గుణశేఖర్ భావించాడు.కానీ సమంత సినిమా లో నటించేందుకు ప్రస్తుతానికి తాను ఆసక్తిగా లేనట్టు శాకుంతలం సినిమా లో నటించేందుకు రానా నో చెప్పాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందిస్తుంది.

సమంత తో నటించేందుకు చాలా మంది ఆసక్తి చూపించలేదు.అందుకే ఆమె కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడైన దేవ్ మోహన్ ను తీసుకొచ్చి ఈ చిత్రం లో నటింపజేశారని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు కానీ నిరాశ పరచితే మాత్రం కచ్చితంగా దేవ్‌ మోహన్ కి ఎంపికకి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొన్ని గంటల్లో సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అప్పుడు గుణ శేఖర్ నిర్ణయంపై క్లారిటీ వస్తుంది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు