సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత (Samantha) ప్రస్తుతం వరుస సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఇప్పటికి ఈమె కామెంట్ అయినటువంటి సినిమాలు అన్నిటిని పూర్తి చేసి సినిమాలకు విరామం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
ఇలా సినిమాలకు ఏడాది పాటు విరామం ఇచ్చిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.అయితే ఈమె తన ఆరోగ్యం పై దృష్టిపెట్టారని పూర్తిగా తన ఆరోగ్యం కుదట పడిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే సమంత ఇప్పటికే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా శివ నిర్వాణ (Shiva Nirvana)దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాతో పాటు సమంత రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్(Citadel) అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను తన వెబ్ సిరీస్ సిటాడేల్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని తెలియజేశారు.నేటితో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయింది.

ఈ క్రమంలోనే సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ జూలై 13 వ తేదీ నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు నేను వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసుకున్నాను అంటూ ఈమె పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె నటిస్తున్నటువంటి ఈ వెబ్ సిరీస్ అలాగే ఖుషి సినిమా రెండు కూడా పూర్తి కావడంతో ఇక సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
అయితే సమంత సినిమాలకు దూరమవుతారని తెలిసి అభిమానులు ఆందోళన చెందినా తాను మయోసైటిసిస్ నుంచి పూర్తిగా కోలుకుంటే చాలని ఆకాంక్షిస్తున్నారు.







